C-Language- Computer Languages
V E S R N TECHNOLOGIES
C Language
ముందుగా ఒక కంప్యూటర్ సమర్ధవంతంగా పనిచేస్తుందంటే దానికి మానవుడు కొన్ని షరతులు విధిస్తూ ఒక ఆదేశం (కమాండ్) ఇస్తాడు.అయితే ఈ commands కంప్యూటర్ ఏవిధంగా తీసుకుంటుంది?
మనం ఏవిధంగా కంప్యూటర్ కు కమాండ్స్ ఇవ్వాలి అనేదే మన మదిలో మెదిలే మొదటి ప్రశ్న.
సరే! ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మనుష్యుల మధ్య సంభాషణ జరుగుతూ ఉందంటే దానికి వారు తమ భావాలని ఒక భాష(language )ద్వారా తెలియజేస్తారు. ఇవి సంజ్ఞలు కూడా కావచ్చు. కంప్యూటర్ కు కొన్ని ఆదేశాలు ఇస్తున్నామంటే దానికి కూడా భాష మాత్రమే కావాలి. దీనినే కంప్యూటర్ భాష అంటారు.
సాధారణంగా ఇవి రెండు రకాలు.
అవి 1) low level language
2) high level language
1) low level language : సాధారణంగా ప్రతీ కంప్యూటర్ కు మనం ఇచ్చే commands, low level లో మాత్రమే ఉండాలి.(ఉన్నత చదువులలో మీరు నేర్చుకుంటారు). అయితే ఈ భాషను మనం నేర్చుకోవడం, అర్ధం అర్ధం చేసుకోవడం కొద్దిగా కష్టతరం. ఉదాహరణకు 0,1 (Binary Number) మరియు Machine language
2) high level language : ఇవి low level language కు పూర్తిగా భిన్నం. వీటినే programming languages అంటారు. ఎవరైతే కంప్యూటర్ కు program వ్రాస్తారో వారినే కంప్యూటర్ ప్రోగ్రామర్ అని,ఈ program వ్రాయడాన్నే కోడింగ్ అని, ప్రోగ్రామింగ్ అని అంటారు. అయితే ఇవి సాధారణంగా ఇంగ్లీషు పదాలతో కూడి ఉంటుంది. అయిననూ మీరు దీనిని పూర్తిగా ప్రారద్రోలండి. ఎందుకంటే మీముందుకు నేను తెలుగులో నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను. సరే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లు సాధారణంగా 1.C , 2.C++ 3.Java ...... గా చెప్పవచ్చు . ఇవి కేవలం మనుష్యులకు మాత్రమే అర్ధమవుతుంది. వీటిని మరల కంప్యూటర్ అర్ధం చేసుకోవాలంటే Assembly Level Language లు ఉపయోగయించబడును.
eg : 1) Text Editor : Notepad, Wordpad, Notepad++
2) Compilers : C, C++
3) Interpreters : Java
4) Operating Systems( Window, Linux)
Interesting Fact:
ఈ Assembly level languages చాలావారకు High level language లోనే వ్రాసారు. ఈ క్రింది చిత్రం గమనించి ఉన్నతంగా ఆలోచించండి
విషయం పరిజ్ఞానం (తప్పు / ఒప్పు )
1) మానవుని ప్రమేయం లేకుండా కంప్యూటర్ పనిచేస్తుంది.
2) కంప్యూటర్ భాషలు సి,సి++ అనేవి low level languages.
3) హై లెవెల్ లాంగ్వేజ్ కంటే లో లెవెల్ లాంగ్వేజ్ కష్టం