Introduction

 

ముందుమాట

 

జీవితంలో ప్రతీ విద్యార్థి తన నిజ జీవితం గురించి ఎన్నో కలలు కంటాడు. వాటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ కు సంబంధించినవి  ఉండొచ్చు. అయితే వాటిని గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా  టెక్నాలజీ ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు.  మేము కూడా కొత్తగా తయారుచేయాలి. అందరూ మేము తయారుచేసిన అప్లికేషన్ వాడాలి అనే భావన కల్గుతుంది. వీటిని  సాధించడం కోసం మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతైనా అవసరం. కంప్యూటర్ పరిజ్ఞానం కోసం మీరు ఇంగ్లీష్ రాకపోవడం వలన మీరు వెనుకంజ వేస్తారు. అయితే మీకు ఇదే  సమస్య అయితే దానిని ఇప్పుడే పారద్రోలండి. ఎందుకంటే మీకోసం కంప్యూటర్ ప్రోగ్రామర్                                 (Be a Programmer) అనే పుస్తకం తెలుగులో మీ ముందుకు తీసుకొని  వస్తున్నాము.   పుస్తకం లో మీరు సి లాంగ్వేజ్ గూర్చి పూర్తిగా నేర్చుకుంటారు.  పుస్తకం మీకు మంచి ప్రోగ్రామర్ గా మీ మిత్రుడుగా మీతో ఉంటుందని, మీరు ఉన్నత శిఖరాలను అందుకుంటారని ఆకాంక్ష.

 

V e s r n Technologies



ముందుగా ఒక కంప్యూటర్ సమర్ధవంతంగా పనిచేస్తుందంటే దానికి మానవుడు కొన్ని షరతులు విధిస్తూ ఒక ఆదేశం (కమాండ్) ఇస్తాడు. అయితే commands కంప్యూటర్ ఏవిధంగా తీసుకుంటుంది? మనం ఏవిధంగా కంప్యూటర్ కు కమాండ్స్ ఇవ్వాలి అనేదే మన మదిలో మెదిలే మొదటి ప్రశ్న.

సరే! ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మనుష్యుల మధ్య సంభాషణ జరుగుతూ ఉందంటే దానికి వారు తమ భావాలని ఒక భాష(language )ద్వారా తెలియజేస్తారు. ఇవి సంజ్ఞలు కూడా కావచ్చుకంప్యూటర్ కు కొన్ని ఆదేశాలు ఇస్తున్నామంటే దానికి కూడా భాష మాత్రమే కావాలి. దీనినే  కంప్యూటర్ భాష అంటారు.

సాధారణంగా ఇవి రెండు రకాలు.

అవి 1) low level language 2) high  level  language

 1) low level language : సాధారణంగా ప్రతీ కంప్యూటర్ కు మనం  ఇచ్చే commands, low level  లో మాత్రమే  ఉండాలి.(ఉన్నత చదువులలో మీరు నేర్చుకుంటారు). అయితే భాషను మనం నేర్చుకోవడం, అర్ధం అర్ధం చేసుకోవడం కొద్దిగా కష్టతరంఉదాహరణకు 0,1 (Binary Number) మరియు Machine  language

2) high  level  language : ఇవి low level language కు పూర్తిగా భిన్నం. వీటినే programming  languages  అంటారు. ఎవరైతే కంప్యూటర్ కు program వ్రాస్తారో వారినే కంప్యూటర్ ప్రోగ్రామర్  అని, program వ్రాయడాన్నే కోడింగ్  అని, ప్రోగ్రామింగ్ అని అంటారు. అయితే ఇవి సాధారణంగా ఇంగ్లీషు పదాలతో కూడి  ఉంటుంది. అయిననూ మీరు దీనిని పూర్తిగా ప్రారద్రోలండి. ఎందుకంటే మీముందుకు నేను తెలుగులో  నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను. సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లు సాధారణంగా 1.C , 2.C++ 3.Java ...... గా  చెప్పవచ్చు . ఇవి కేవలం మనుష్యులకు మాత్రమే అర్ధమవుతుంది. వీటిని మరల కంప్యూటర్ అర్ధం చేసుకోవాలంటే Assembly Level  Language  లు 

ఉపయోగయించబడును.

eg : 1) Text Editor : Notepad, Wordpad, Notepad++

2) Compilers : C, C++

3) Interpreters : Java

4) Operating Systems( Window, Linux)

 

 

Interesting Fact:

Assembly  level  languages చాలావారకు High level language  లోనే వ్రాసారు. క్రింది చిత్రం గమనించి ఉన్నతంగా ఆలోచించండి



 

విషయం పరిజ్ఞానం (తప్పు / ఒప్పు )

 

1) మానవుని ప్రమేయం లేకుండా కంప్యూటర్ పనిచేస్తుంది.

2) కంప్యూటర్ భాషలు సి,సి++ అనేవి low level languages.

3) హై లెవెల్ లాంగ్వేజ్ కంటే లో లెవెల్ లాంగ్వేజ్ కష్టం



 

Popular posts from this blog

Install Windows 7 Operating System - Practical

COPA Bits for Computer Based Test (CBT) by Venugopal Vanjarapu

COPA